*శివ, కేశవుల కల్యానానికి సిద్ధం అవుతున్న గోటి తలంబ్రాలు*
*గజ్వేల్ గల్లీ గల్లీలో గోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమైందన్న*
*సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు*
లో ప్రసిద్ధి చెందిన సీతారామ, ఉమామహేశ్వరుల ఈనెల 22న జరుగును. కల్యానానికి గోటి తలంబ్రాలు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అందించాలని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ శ్రీకారం చుట్టింది. భద్రాచల రాముని కళ్యానానికి అందించాము మన ప్రాంతంలో జరిగే కల్యానానికి అందించలెమా అని భక్తుల కోరిక మేరకు రెండోసారి గోటి తలంబ్రాల కార్యక్రమం గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
గజ్వేల్ లోని ప్రతి ఇంటిలో రామనామ స్మరణ చేస్తూ భక్తులు గోటితో వడ్లను ఓలిచి ఆదివారం నాడు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు. గోటి తలంబ్రాల్లో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యమో అని కొనియాడారు. మా చేతులతో ఓలిచి మా రామయ్య, శివయ్యా కల్యానానికి అందించే భాగ్యం కలగడం ఎంత అదృష్టమో అని భక్తులు ఆనందాన్ని వెలుబుచ్చారు.