మాజీ సర్పంచ్ ను పరామర్శించిన చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిన్నారం మండలం మంగంపేట గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరేందర్ ఇటీవల ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడిపోయి గాయపడ్డాడు. స్థానిక నేతల ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా నరేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

Join WhatsApp

Join Now