కామారెడ్డి మండలంలో ప్రజా పాలనలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు
–
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో ప్రజా పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు. నాలుగు పథకాలు ఆరంభించి లబ్ధిదారులకు చెక్కులు, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పథకాలు అందజేస్తున్నాం అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిగా కామారెడ్డి మండలం గూడెం గ్రామం నుండి లబ్ధిదారులకు అభివృద్ధి పథకాలను అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో 178 ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పథకాలను లబ్ధిదారులకు అందించారు. రైతు భరోసా 546 లబ్ధిదారులకు, 1124 ఎకరాలకు 67 లక్షల 45వేల
606 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. భూమిలేని రైతు కూలీలకు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా 8 మంది లబ్ధిదారులకు 12000 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. 36 మందికి కొత్త రేషన్ కార్డులు, అలాగే 61 మంది రేషన్ కార్డులకు గ్రామ సభలో అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఇవే కాకుండా మీ సేవలో, ప్రజా పాలనలో 98 మంది కొత్త రేషన్ కార్డు గురించి వినతి పత్రాలు అందజేశారనీ, దానిపై విచారణ జరిపించి అర్హులైన వారికి కూడా అందిస్తాం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఇచ్చిన మాట తప్పదు, మడమతిప్పదన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి మళ్ళీ ఇప్పుడు పేదలకు పథకాలు అందిస్తుంటే వారి కడుపు మండిపోయి విమర్శలు చేస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడ్డది మాటలతో కాకుండా పేదలకు అభివృద్ధి పథకాలతో ఆదుకుంటున్నాం,
ఎన్నికల్లో చేసిన వాగ్దానాల కంటే ఇంకా ఎక్కువగానే అమలు చేస్తున్నాం, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షాలకు ఓటుతో బుద్ధి చెప్తారనీ ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజా గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.