*ప్రజాపాలన దినోత్సవం: ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి – జిల్లా కలెక్టర్ మను చౌదరి*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, తెలంగాణ గీతానికి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ, “ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత, నిజాయితీతో తమ విధులు నిర్వర్తించాలి. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించి, ప్రజా ప్రతినిధులుగా తమ గౌరవాన్ని కాపాడుకోవాలి” అని సూచించారు.
ఈ వేడుకల్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి, జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీఆర్‌డీఓ సాంబశివరావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, డీఈఓ విజయకుమారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాంమోహన్, ఇన్‌ఛార్జ్ డీఆర్‌డీఓ పీడీ కాంతమ్మతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.