ప్రశ్నయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 6
కబ్జాకు గురైన భూములను తక్షణమే పేదలకు పంచాలి.
దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కంటే కేశవ గౌడ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో కబ్జాకు గురైన భూములను తక్షణమే పేదలకు పంచాలని ఆధార పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. కబ్జా చేసిన భూములను పేదలకు ఇవ్వాలని చేపట్టిన దీక్షలకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేశవ గౌడ్ మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూములను దోచుకుని అందిన కాడికి కాజేస్తున్నారని, వెంటనే ఆ భూములను పేదలకు పంచాలని కోరారు. అదేవిధంగా పేదల కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్న దీక్షలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల పేదలను కలుపుకొని వారి పక్షాన తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. దోచుకున్న భూములను అర్హులైన పేదలకు పంచాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకులు వాడే వీరస్వామి. ఆదివాసి జేఏసీ చైర్మన్. బండారు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. కొలికి పోవు గంటా యాట్ల శివకుమార్.. కారం నాగేంద్ర.ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.