ప్రభుత్వం అంటే నిర్మాణం చేయాలి.. సమాజాన్ని నిలబెట్టాలి.
– పాలకుర్తి నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీలో చేరిన సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మరియు సినీ ఆర్టిస్ట్ రవితేజ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.
ఈ సందర్భంగా కేసీఆర్ గారి కామెంట్స్ 👇
🟪 మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారు.
🟪 వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం.
🟪 అందులో అనుమానమే లేదు. ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్ధం అయ్యింది.
🟪 ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయి.
🟪 బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలి.
🟪 అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి. వీణ్ణి లోపల వేయాలని మనం చూడం.
🟪 ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలి. నిర్మాణం చేయాలి. పది మందికి లాభం చేయాలి.
🟪 ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు.
🟪 గత ఎన్నికల్లో మనం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే, కానీ 90 శాతం ఎవరు ఆడగకున్నా పనులు చేసి చూపించాం.