ధోభీఘాట్లకు ప్రభుత్వం స్థలాలను కేటాయించాలి – గోపి రజక 

గ్రామాల్లో ధోభీఘాట్లకు ప్రభుత్వం స్థలాలను కేటాయించాలి – గోపి రజక 

ప్రభుత్వ నిధులతో కమ్యునిటీ హాల్ నిర్మించాలి – సి.మోహన్ 

 వికారాబాద్ జిల్లా కోడంగల్ అంగడి రాయిచూర్ మండలంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మండల ఇన్చార్జ్ సి.మోహన్ ఆధ్వర్యంలో 23-9-2024 సోమవారం ఏర్పాటుచేసిన గ్రామ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా ఉపాధ్యక్షులు సి.బాలప్ప హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉతకడానికి అనేక ఇబ్బందులు పడుతున్న రజక కులస్తులకు ప్రతి గ్రామంలో ఒక ఎకరా భూమి కేటాయించి అందులో ధోబి ఘాట్ నిర్మించి ప్రభుత్వ నిధులతో బోరు వేసి కమ్యూనిటీ హాల్ కట్టించాలని ఈ సందర్భంగా వారు అన్నారు మండల ఇన్చార్జి సి.మోహన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉతకడానికి చెరువులు కుంటలు సుదూర ప్రాంతాల్లో ఉండడం చేత ఒంటరి మహిళలకు ఇబ్బంది అవుతుందని కాబట్టి గ్రామాలకు సమీపాన ఒక ఎకరా భూమి కేటాయించి ధోభీఘాట్ నిర్మించాలని అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కింద బడ్జెట్ ని కేటాయించాలని కొడంగల్ నియోజకవర్గంలో రజక స్త్రీలు ఉతకడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పనికి తగ్గ వేతనం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం సతీష్,పకిరప్ప, రాములు తదితరులు హాజరయ్యారు..

Join WhatsApp

Join Now