ప్రభుత్వం ఇకనైనా మా సమస్యలను పరిష్కరించాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్

తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్, 2008 ఏర్పడింది. ఏర్పడిన నాటినుండి ఈ నాటి వరకు మా కార్మికులను పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి. పాత పాలకులు పోయి కొత్త పాలకులు వస్తున్నారు. మా కార్మికుల జీవితాలు దుర్బరం గానే వున్నాయి. తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్లో 120 మంది కార్మికులు వున్నారు.మాకు పని చేసుకోవటానికి సొంత స్థలములు లేక,ఫ్లాట్ ఫామ్ మీద మా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. మాకంటూ ఒక స్థలము కేటాయించి, ఆటో నగర్ ఏర్పాటు చేయిలని, ఇక నైనా మా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలని,అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, జారే. ఆదినారాయణకు వినతి పత్రం అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోటార్ వర్కర్స్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now