ఇంటి గోడలు కూలిపోయిన కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 23
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆదివాసి జేఏసీ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం,ఇందుకూరుపేట గ్రామస్తులు మాదాసు సుబ్బలక్ష్మి భర్త సత్యనారాయణ పెంకిటిల్లు ఇటివల కురిసిన భారీ వర్షాలకు రెండు గోడలు కూలిపోయిన కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఎన్డీఏ కూటమి నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,దేవీపట్నం టిడిపి మండల ప్రెసిడెంట్ మర్రిశెట్ల వెంకటేశ్వర్లు (బుజ్జి) మరియు ఎన్డీఏ నాయకులు మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండల పరిధిలోని ఇందుకూరు పేట రెవిన్యూ గ్రామపంచాయతీలో ఉన్న ఇందుకూరు పేట గ్రామ కాపురస్తులు మాదాసు సుబ్బలక్ష్మి భర్త సత్యనారాయణ పెంకుటిల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా ఇంటి రెండు గోడలు రాత్రి సమయంలో కూలిపోయాయి అన్నారు.ఇంట్లో గత ఐదు సంవత్సరాలుగా పోతవరం గ్రామస్తులు కారం శ్రీరామమూర్తి దొర భార్య అన్నారం వారి కుటుంబ సభ్యులు అద్దె కుంటున్నారన్నారు. నిన్న రాత్రి ఇంటి గోడలు కూలిన సమయంలో కారం శ్రీరామ్ మూర్తి కుటుంబ సభ్యులు మెలుకువగా ఉండడంతో పెను ప్రాణ ప్రమాదం నుండి తప్పిం చుకున్నరన్నారు..ఇంటి గోడలు కూలిన సమయంలో ఇంట్లో ఉన్న రెండు బీరువాలు,డబల్ కాట్ మంచం,డ్రెస్సింగ్ టేబుల్ మొదలైన వస్తువులు పూర్తిగా ధ్వంసం అయినవి అన్నారు.కుమ్మరిపేట వీధిలో ఉన్న ప్రజలందరూ మురికి కాలువ నీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మా ఇంటి గోడలన్ని కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.ఈ ఇంటి గోడలు కూలి పోవడానికి ప్రధాన కారణం కూడా డ్రైనేజీ లేకపోవడమే అన్నారు. సంబంధిత పంచాయతీ శాఖ అధికారులు,ప్రజా ప్రతినిధులకు తక్షణమే స్పందించి సీసీ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఇంటి గోడలు కూలిపోయిన,ఆస్తి నష్టం సంభవించిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కోటమ నాయకులు దేవీపట్నం బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర,జనసేన దేవిపట్నం మండల నాయకులు కె.వీరబాబు,దేవీపట్నం టిడిపి మండల మహిళా నాయకురాలు కారం పోచమ్మ
తదితరులు పాల్గొన్నారు.