మల్లన్న సాగర్ భూనిర్వాసతులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

*మల్లన్న సాగర్ భూనిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి*

సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ.

సిద్దిపేట ఆగస్టు 5 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి దాదాపు ఆరు సంవత్సరాలు పూర్తెన ముంపునకు గురైన గ్రామాల నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పటివరకు అందలేదని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ తెలిపారు. సోమవారం కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమంలో వారికి రావలసిన పరిహారం సంబంధించి దరఖాస్తులు అడిషనల్ కలెక్టర్ గారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముంపు గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఒంటరి మహిళలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు రిజిస్ట్రేషన్, 18 సంవత్సరాలు పైబడిన యువతకు ప్యాకేజీ మరియు ఫ్లాట్ రిజిస్ట్రేషన్, కొన్ని అసైన్డ్ భూముల పరిహారాలు కూడా గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లించలేదని, దీని కొరకు దాదాపు ఆరు సంవత్సరాల నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ఈ సమస్యలు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. కావున తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం వెంటనే నిర్వాసితుల పరిహారలను అందించాలని లేనియెడల నిర్వాసితులను ఏకం చేసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులు, సిపిఐ పార్టీ పల్లెపహాడ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now