పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
ఘనంగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం
జమ్మికుంట ఆగస్టు 24 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆదివారం రోజున మండల,పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని దుబ్బ మల్లన్న దేవాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు సమ్మేళనానికి పిల్లలు,పెద్దలు కుటుంబ సమేతంగా హాజరై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఆహ్లాదకర వాతావరణంలో పాలుపంచుకున్నారు ముఖ్యంగా చిన్నారులు చేసిన పలు కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఆటపాటలలో గెలుపొందిన వారికి ఆర్యవైశ్యుల ప్రముఖుల చేతుల మీదుగా చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు అనంతరం ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఒకచోట చేరి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అదేవిధంగా ప్రస్తుత సమాజంలో సేవ కార్యక్రమాలు చేయడంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆర్యవైశ్యులు ప్రస్తుతం పలు విధాల సమస్యలు ఎదుర్కొంటున్నారని పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వారికి అండగా నిలవాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులను నిలబెట్టుకొని వారిని గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆర్యవైశ్యులు అందరం కలిసికట్టుగా ఉంటూ ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కారానికై కృషి చేస్తూ, అభివృద్ధిలో సైతం ముందు సాగుదాం అని పేర్కొన్నారు స్థానిక ఆర్యవైశ్యులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు ఎలిమిళ్ల రాజేంద్రప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఎన్. నర్సన్న, ప్రధానకార్యదర్శి బాదం సురేష్ బాబు,ఆర్యవైశ్య ప్రముఖులు బచ్చు భాస్కర్,చంద రాజు,ఆర్యవైశ్య జిల్లా నాయకులు యాద సతీష్,అకినపల్లి మురళి, సుధాకర్,పట్టణ మహిళా అధ్యక్షురాలు ముక్క మాదవి,యూత్ అధ్యక్షుడు తంగళ్లపెల్లి శ్యామ్, వాసవి క్లబ్ అధ్యక్షుడు అయితు రమేష్,వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు స్వామిశెట్టి అకిలాండం,అభ్యుధయ సంఘనాయకులు వివిధ ఆర్యవైశ్య నాయకులు, స్థానిక ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.