స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జులై 26:
స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా తెలిపారు. శనివారం, ఆమె తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళా శక్తి గ్రూపులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను మున్సిపల్ కమిషనర్ జ్యోతితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే మహిళా శక్తి గ్రూపులకు క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు.
అనంతరం, మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఆమె రెయిన్‌కోట్‌లను పంపిణీ చేశారు. వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.