*భీమేశ్వరాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూజలు*
వేములవాడ,డిసెంబర్ 05
వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయంలో మన్యసూక్త సహిత రుద్రాభిషేక హవనం నిర్వహించగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస పాల్గొన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.