తెలంగాణ తల్లిని అవహేళన చేస్తే నాలుక కోస్తాం – ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

 

తెలంగాణ తల్లిని అవహేళన చేస్తే నాలుక కోస్తాంమని *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య  అన్నారు హైదరాబాద్ లోని సీఎల్పీ లో మీడియా సమావేశం మాట్లాడిన ఆయనత తెలంగాణ తల్లి పైన బీఆర్ఎస్ అత్యంత హేయమైన, నీచమైన రాజకీయాలు చేస్తోందన్నారు.తల్లివిగ్రహావిష్కరణ తర్వాత కూడా దీక్షలు, ధర్నాలు చేయడం వారి అహంకారానికి పరాకాష్టన్నారు.పదేళ్ల లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎందుకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదో ముందు సమాధానం చెప్పాలన్నారు. తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారంగా ప్రతిష్టించలేదు..?.ప్రశ్నించారు.తెలంగాణ భవన్ లో పెట్టుకున్న విగ్రహాన్నే అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేయడం పరాకాష్ట ప్రతి రూపం అన్నారు .తెలంగాణ తల్లి విగ్రహం పై కేసీఆర్ కుట్ర లు చేశాడని..తెలంగాణ పిత గా తన విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకోవాలనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించలేదున్నారు.తాను చనిపోయేంత వరకు తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ నే అధికారంలో ఉంటుందని కేసీఆర్ భావించాడు..అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రతిష్టంచలేదన్నారు.తన మరణం తర్వాత తెలంగాణ పిత గా తన విగ్రహాన్ని పెట్టించుకోవాలన్నదే కుట్ర చేసారని.

ఉద్యమా సమయంలో మొట్టమొదటగా తెలంగాణ తల్లి విగ్రహన్నీ ఆలేరు నియోజకవర్గం రాజపేట మండలం బేగం పేట గ్రామంలో ఇలంతో రుపమ్ తోనే విగ్రహాన్ని నెలకొల్పిరన్నారు.మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..ఆ విగ్రహంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆడబిడ్డ ను చూసుకుంటున్నారు..ఆకుపచ్చని రంగులో తల్లి విగ్రహం చూస్తుంటే ఆనందం తో ఒళ్ళు పులకరించి పోతుంది..ఇలాంటి అద్భుతమైన తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి, శిల్పి కి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి ఓర్వ లేక బీఆర్ఎస్ ధర్నాలు, దీక్షలు అంటోంది..తెలంగాణ భవన్ లో కవిత దీక్ష చేస్తున్నారు..? ఆమె దీక్ష ఎందుకు…? ప్రశ్నించారు..తెలంగాణ తల్లి విగ్రహం తనలా లేదని ఆమె దీక్ష చేస్తుందా..? నీ లాగా వజ్ర వైడూర్యాలు, కిరీటాలు, ధగధగా మెరిసే పట్టు చీరలు తెలంగాణ తల్లికి లేవని బాధ పడుతున్నావా..? అని  ఒక చేతిలో లిక్కర్ బాటిల్ పెట్టి   ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ ల్లో తెలంగాణ తల్లి ఉన్నట్లు పెట్టాలా.?కొంచెమైనా సిగ్గుండాలి మాట్లాడటానికిఆన్నారు.

 

ఏ మొహం పెట్టుకొని దీక్ష చేస్తున్నారు..?..తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారంగా ఎందుకు ప్రతిష్ట లేదని మీ అయ్య ఫామ్ హౌస్ ముందు దీక్ష చేయి..అమ్మ ను మార్చారని కేటీఆర్ అంటున్నాడు.. మాట్లాడటానికి సిగ్గుండాలి .ఎంమీరు కనీసం అమ్మ ను గుర్తించని బిడ్డలు మీరు..  అమ్మ ను అనాధ  చేసిన నీచులు, రాక్షసులు, కిరాతకులు మీరు తెలంగాణ తల్లిని అనాథ గా మార్చి తెలంగాణ భవన్ లో బందీ చేసింది మీరు..అమ్మ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.. మా ముఖ్యమంత్రి అమ్మ ను గుర్తించి, సగర్వంగా సచివాలయంలో నడిబొడ్డులో ప్రతిష్టించారు..అమ్మకు తెలంగాణ రూపాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రజల ఇలవేల్పుగా మార్చారు.కేటీఆర్ .. తెలంగాణ తల్లి అవహేళన చేస్తే నాలుక కోస్తాం..

Join WhatsApp

Join Now