*నవధాన్య విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 21( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు
కురుపాం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు నవధాన్య విత్తనాలను ప్రభుత్వ విప్ కురుపాం నియోజకవర్గ శాసన సభ్యురాలు *తోయక జగదీశ్వరి* పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో పండించే పంటలు ఆరోగ్యానికి మంచిది అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జె ఉమామహేశ్వరి, మండల కన్వీనర్ కొండయ్య, నాయకులు భారతమ్మ, మాసయ్య, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు, పంచాయతీ సెక్రెటరీ వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు