వీఆర్వో కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి .

*వీఆర్వో కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి .*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 7 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, వనిజ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తమ్ముడు నిమ్మక విజయనంద్ బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇతను వీరఘట్టం మండలంలో విఆర్ఓగా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కురుపాం ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ *తోయక జగదీశ్వరి* వనిజ గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు పల్లా రాంబాబు, నాయకులు దత్తి లక్ష్మణరావు, ఎంపీపీ బొంగు సురేష్, డొంకాడ రామకృష్ణ, అక్కెన మధుసూదన్ రావు, అంబటి రాంబాబు, జియ్యమ్మవలస మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now