కొత్తవలస లో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే.. తోయిక జగదీశ్వరి

*కొత్తవలస లో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే.. తోయిక జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 1 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు

కురుపాం నియోజకవర్గం, గుమ్మలక్ష్మీపురం మండలం, కొత్తవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెల ఒకటవ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, ఏఎంసి చైర్పర్సన్ కడ్రక కళావతి, ఎంపీడీవో త్రివిక్రమరావు, ఎమ్మార్వో శేఖర్, మాజీ ఎంపీపీ తాడంగి లక్ష్మణరావు, కొత్తవలస మాజీ సర్పంచ్ కడ్రక కృష్ణారావు, మాజీ ఏఎంసి చైర్మన్ కోలా రంజిత్ కుమార్, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, నాయకులు దాసు, ధర్మారావు, రంజిత్, అనిల్, బలరాం, జానకి, సీతారాం, రమేష్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment