*బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే..*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 7 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్త మహేశ్వరరావు
నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పక్క రహదారి సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* అన్నారు. బుధవారం నాడు జియ్యమ్మవలస మండలంలో పార్వతీపురం, జియ్యమ్మవలస R&B రహదారి నుండి గెడ్డతిరువాడ పంచాయతీ చిలకలవానివలస మీదుగా పసుపువానివలస వరకు 1.65 కిలోమీటర్లు గల రోడ్డుకి 1కోటి 65 లక్షలు నిధులతో మంజూరైన నూతన బీటీ రహదారి నిర్మాణ పనులకు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* భూమి పూజ చేసి, రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో నాయకులు దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, జియ్యమ్మవలస ఎంపిపి బొంగు సురేష్, గురాన శ్రీరామ్మూర్తి నాయుడు, జోగి భుజంగరావు, దాసరి రామారావు, సంజు, శివ, ఇంజనీర్ అధికారులు, రెవిన్యూ అధికారులు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.