*జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 4( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి , కొండపల్లి శ్రీనివాసరావు తో కలిసి ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* పాల్గొన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులు మీద చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, కలెక్టర్లు అంబేద్కర్, శ్యాం ప్రసాద్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.