*శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి 13వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ..*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21(ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు….
అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభిమాన పార్టీ తెలుగుదేశం తరఫున అభిమాన నాయకురాలు *తోయక* *జగదీశ్వరి* అత్యధిక మెజార్టీతో గెలవాలని తమ ఇష్ట దైవాన్ని, దేవతలకు మొక్కుకున్న భక్తులు తమ మొక్కలు చెల్లించడం జరుగుతుంది. ఈ మేరకు సోమవారం నాడు గొటివాడ గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు తిమ్మక్క సుందర్ రావు, వాసు, ధర్మారావు, ఎన్ హరిత గొటివాడ గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి కి తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి మొక్కును చెల్లించారు. కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* కి సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమని, సుఖశాంతులతో జీవించాలని ఆశీర్వదించమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, నాయకులు మర్రాపు పురుషోత్తం నాయుడు, పొట్నూరు వెంకట్ నాయుడు, విజయంకుశం, కోట సుమన్, అడ్డాకుల నరేష్, రామకృష్ణ, స్థానిక సర్పంచ్, గొటివాడ గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.