ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం – బాల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి.

*ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం – బాల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి.*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏపీర్ల 13( ప్రశ్న ఆయుధం)దత్తి మహేశ్వరావు

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక కైలాసనాథ ఆలయ ప్రాంగణంలో ఆదివారం నాడు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా బాల,బాలికలకు చిన్నతనం నుండే గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గౌరీశంకర్రావు, ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.గౌరన్నదొర, రాష్ట్ర క్రీడ ప్రముఖ్ కె.ఆనందరావు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పి.శ్రీదేవి, మన్యం జిల్లా అధ్యక్షులు టి.నాగభూషణం, ఏఎంసి చైర్మన్ కె కళావతి, ఎమ్మార్వో శేఖర్, సింహాచలం, భూషణ్, సుబ్బలక్ష్మి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment