పాఠశాల కాంపౌండ్ వాల్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి.. 

*పాఠశాల కాంపౌండ్ వాల్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి..*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

కురుపాం మండలం, పెదగొత్తిలి పంచాయితీ కేంద్రం పరిధిలోని కోలిసగూడ, ఆరికకొరిడి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన స్కూలు కాంపౌండ్ వాల్స్ ను మంగళవారం నాడు ప్రభుత్వ విప్ మరియు కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అనంతరం పెదగొత్తిలి పంచాయతీ కేంద్రంలో స్థానిక సర్పంచ్ తాడంగి లోకనాథం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు పెదగొత్తిలి గ్రామంలో ఎమ్మెల్యే కి మహిళలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ప్రజలనుండి వినతులను స్వీకరించడం జరిగింది. వినతులు పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. గ్రామ మహిళా మండలి సభ్యులు ఎమ్మెల్యే కి చిరు సన్మానం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కలిసేటి కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, స్థానిక సర్పంచ్ తాడంగి లోకనాథం, మాజీ ఎంపీపీ రమణమూర్తి, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు రంజిత్ కుమార్ నాయకో, మాజీ సర్పంచ్ బి అనసూయ, మాజీ ఎంపిటిసి ఎన్ పద్మావతి, నాయకులు సింహాచలం విప్లవ కుమార్ ఆనందరావు, శంకర్, రామకృష్ణ, ఎంపీడీవో ఉమామహేశ్వరి, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment