*కాటిరేవుల(ఎడ్ల పండగ) మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..*
సిరిసిల్ల ,జనవరి10,
వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధిలోని రేణుక ఎల్లమ్మ వద్ద మహాలక్ష్మి రైతు మిత్ర సంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటిరేవుల మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. వారు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న కాటిరేవుల పండగను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.. రైతులు ఎడ్లను పశుసంపదను తమ ఆస్తిగా భావిస్తారని తెలిపారు.. వ్యవసాయానికి సహాయం చేసే ఎడ్లను దైవంగా భావించి నేడు వాటికి ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు.. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగించడం పట్ల సంఘ సభ్యులు అభినందించారు..