*రాజన్న ఆలయ అభివృద్ధిపై కమిషనర్ తో ప్రభుత్వ విప్*
వేములవాడ,డిసెంబర్ 05
రాజన్న ఆలయ అభివృద్ధి గురించి ఆదివారం దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్తో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చర్చించారు. అనంతరం రాజన్న స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల వీటీడీఏ సమావేశంలోని పలు అంశాలపై చర్చించారు. రానున్న శివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని సూచించారు.