*ఎయిర్ లైన్స్ కు ప్రభుత్వం కీలక ఆదేశాలు*
భారత్ కు రాకపోకలు సాగించే అన్ని ఎయిర్లైన్స్ కు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విమానాల్లో ప్రయాణించిన విదేశీ ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా తెలియ జేయాలని ఆదేశించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ పాటించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఫ్లైట్ బయల్దేరే 24 గంటల ముందు ప్రయాణికుల మొబైల్, పేమెంట్ విధానం, ప్రయాణ వివరాలు, ఈ-మెయిల్, బ్యాగేజీ సమాచారం పంచుకోవాలంది.