*ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి జారిపడిన గీత కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలి- గౌడ సంఘం నాయకులు*
*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 3*
తాడిచెట్టు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడిన గీతా కార్మికుడు గాయాలైన సంఘటన ఇల్లందకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది శుక్రవారం రోజున సమ్మెట మొగిలి తండ్రి రాజయ్య వయస్సు 59 సంవత్సరాలు కుల వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కళ్ళు తీస్తుండగా ప్రమాదవశాత్తు మోకుజారి కింద పడి గాయాలపాలైనాడని విషయం తెలుసుకున్న సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు వెళ్లి పరామర్శించి మాట్లాడుతూ ప్రభుత్వం గీత కార్మికుని ఆదుకోవాలని రెక్క ఆడితే గానీ డొక్కాడని కుటుంబానికి చెందిన వ్యక్తి గీత కార్మిక సంఘం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఇల్లందకుంట మండలం సొసైటీ అధ్యక్షుడు రావుల శివకుమార్ గౌడ్ ఇల్లందకుంట మండల సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోడేటి జితేందర్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడగొని బుచ్చయ్య గౌడ్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పల్లెర్ల కొమురయ్య గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు గాజుల శంకరయ్య గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షుడు సమ్మెట ప్రవీణ్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు గట్టు వీరన్న గౌడ్ టేకుర్తి గ్రామ సొసైటీ అధ్యక్షుడు తోడేటి రమేష్ గౌడ్ సమ్మెట వికాస్ గౌడ్ దేశిని మహేష్ గౌడ్ ఇంజం శంకర్ తదితరులు పాల్గొన్నారు