*లడ్డూ తయారీ కేంద్రం తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్*
వేములవాడ, జనవరి08,
విప్, కలెక్టర్ తదితరులు లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూం, లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు, నెయ్యి, తయారీ విధానం, పరిసరాలు తనిఖీ చేశారు. రోజు ఎంత నెయ్యి వినియోగిస్తున్నారు, ఎన్ని లడ్డూలు రోజు సిద్ధం చేస్తారు? ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారో ఆరా తీశారు. లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పూర్తిగా ఆధునీకరించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.