తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు శుభాకాంక్షలు తెలిపిన గౌడ సుదీప్ గౌడ్

మెదక్/నార్సింగి, మర్చి 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదినం పురస్కరించుకొని నార్సింగి జాగృతి మండల అధ్యక్షుడు గౌడ సుదీప్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 13న కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుదీప్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఇతర దేశాలకు తెలియజేసేలా కవిత ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చి, వివిధ అంతర్జాతీయ వేదికలపై వాటిని గౌరవప్రదంగా నిలిపారని అన్నారు. కవిత నాయకత్వంలో జాగృతి సంస్థ యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి, మహిళా సాధికారితకు ఆమె విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమె నాయకత్వంలో మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కవిత, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ యువతలో జాగృతి తేవడంలో ముందు ఉన్నారని సుదీప్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు, నాయకుల తరపున కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు

Join WhatsApp

Join Now

Leave a Comment