జిఆర్ కాలనీ ముంపు బాధితులను పరామర్శించిన కలెక్టర్

జిఆర్ కాలనీ ముంపు బాధితులను పరామర్శించిన కలెక్టర్

కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీకి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శన

వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు, నిత్యావసరాల సరఫరా

పాక్షికంగా దెబ్బతిన్న 48 ఇళ్లకు ఒక్కింటికి ₹11,500 ఆర్థిక సాయం

శానిటేషన్, విద్యుత్, త్రాగునీటి పునరుద్ధరణ వేగవంతం

ప్రభుత్వ సహకారంతో సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి

ప్రశ్న ఆయుధం, ఆగస్టు 31కామారెడ్డి

జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ముంపునకు గురైన కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీని ఆదివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎమ్మెల్సీల బృందంతో కలిసి సందర్శించారు. బాధితులకు అందిస్తున్న సహకారాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత కుటుంబాలకు ఆహారం, త్రాగునీరు సరఫరా చేసి, వరద తగ్గిన వెంటనే మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కాలనీలో శానిటేషన్ కార్యక్రమాలు, విద్యుత్ పునరుద్ధరణ, త్రాగునీటి సరఫరా పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

ముంపులో పాక్షికంగా దెబ్బతిన్న 48 ఇళ్లకు ఒక్కింటికి ₹11,500 ఆర్థిక సాయం అందజేశామని, వాటితో పాటు దుప్పట్లు, నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి పూర్తి సహకారం అందించిందని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment