*
-రాష్ట్రస్థాయి కి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఇన్చార్జి కరస్పాండెంట్ పుల్లారావు, ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు.
జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో శుక్రవారం నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడలలో మణుగూరు గ్రేస్ మెషిన్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరచి సత్తా చాటారు.కబడ్డిలో వడ్లకొండ రామ్ చరణ్,లక్ష్మణ్ తేజ అన్నదమ్ములు, షాట్ పుట్ లో కొమరం సన్నీని రాష్ట్రస్థాయి జూనియర్ క్రీడలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కరస్పాండెంట్ కొమ్మునూరి పుల్లారావు, ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడలకు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాలలో క్రీడా పోటీలను నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయికి వెళ్లే విధంగా కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రేస్ మిషన్ స్కూల్ వార్డెన్ సామెల్, పిఈటి వెంకట్, భాస్కర్, సురేష్, ఉపాధ్యాయులు,ఉపాధ్యాయురాలు అభినందనలు తెలిపారు.