*పత్తి క్వింటాల్ గరిష్ఠ ధర రూ 7,350*
*క్రమక్రమంగా పెరుగుతున్న పత్తి ధర*
*జమ్మికుంట జనవరి 17 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు శుక్రవారం విడి పత్తి 158 క్వింటాల్ లు 14 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకు వచ్చారు. గరిష్ఠ ధర రూ 7,350 ,మాడల్ ధర రూ 7,250,కనిష్ట ధర రూ 6,800 పలికింది కాటన్ బ్యాగులలో 8 క్వింటాల్ లు ముగ్గురు రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. గరిష్ఠ ధర రూ 6,700, మాడల్ ధర రూ 6,400,కనిష్ట ధర రూ 6,200 పలికిందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. శని, ఆది వారాలు మార్కెట్ కు సాధారణ సెలవులు కాగా తిరిగి ఈ నెల 20 సోమవారం మార్కెట్ పునః ప్రారంభం అవుతుందని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.