రైతు పేరుతో ధాన్యం రవాణా..?
– అక్రమార్కులకు వంత పడుతున్న జిల్లా అధికారి..?
– ఫామ్ 10ని దేనికి వాడతారు..?
– ఫామ్ 10రైతులు వాడుతారా..?
-వ్యాపారస్తులు వాడుతారా…?
– ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రైసుమిల్లర్లు
లోడింగ్ రైస్ మిల్ నుండి..! ఫామ్ 10వేరే గ్రామం నుండి..!!
*జిల్లా సివిల్ సప్లై అధికారి వివరణ కోరగా మీరు పిర్యాదు చేస్తేనే మేము ద్రుష్టి సరిస్తాం…!!
అధికారులు ఆలా చెప్పడం వెనుక రహస్యలు ఎమిటో…?
విలేకరులతో పొంతన లేని సమాధానం చేప్పుతూన్నా. ఆధికారి…!!
ఫామ్ 10ఎవరు ఇస్తారు..?
ఫామ్ 10పై ఎలాంటి ముద్రలు ఉండవా..?
రైస్ మిల్ ల్లో ధాన్యం లోడ్ అవుతే వారి బిల్స్, గాని వే బిల్ గాని ఉండవా…?
ఫామ్ 10పై పంపించడానికి ఏమైనాఅధికారులు పరిమిషన్ ఇచ్చిరా…?
ప్రభుత్వం ధాన్యం ఇచ్చింది అమ్ముకోవడానికా…?
ధాన్యం మిల్లింగ్ చేసి ప్రభుత్వనికి బియ్యం పెట్టడానికా..?
ఫామ్ 10కు లారీ కిరాయికి సంబంధం లేదు..?
40kg బస్తాలు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం..?
70kg బస్తాలు ప్రైవేట్ గా..?
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని కొందరు రైసుమిల్లలు ప్రభుత్వానికి భారీ మొత్తంలో గండి కొడుతున్నారు. ఫామ్ 10ని తో రైస్ మిల్లర్లు ఒక రాష్ట్రము నుండి మరోరాష్ట్రానికి తరలించేందుకు ఫామ్ 10వాడుతున్నారని ఆరోపణలు వున్నప్పుటి ఫామ్ 10ని అడ్డుపెట్టుకొని ఏకంగా రైతుల పేరు రాసి ఇతర రాష్ట్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. . అక్రమ రవాణా అరికట్టవలసిన జిల్లా అధికారులే రిజిస్టర్లు రెండు ఉంటాయని ఒకదాంట్లో కొనుగోలు మరో దాంట్లో అమ్మకాలు రాసుకోవచ్చు అని, రైస్ మిల్ నెలలు బయట ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇతర రైస్ అమ్ముకుంటారని వాటికి ఎలాంటి లైసెన్సులు కానీ అనుమతులు కానీ ఉండవని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఫామ్ 10 ఒక రైతు వద్ద 710 బస్తాల ధాన్యాన్ని ఇతర రాష్ట్రానికి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రైతు పంట పండించిన తర్వాత ఇన్ని రోజులు ధాన్యాన్ని తమ వద్ద ఉంచుకోరు. అలాంటిది ఓ మహిళా రైతు 710 బస్తాల ధాన్యాన్ని ప్రస్తుతం అమ్మినట్లు ఫామ్ 10 లో రాయగా, . లారీ కిరాయి పత్రము లో 850బస్తాలు రాయడం జరిగింది. రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వ కొనుగోళ్లలోనే రైతులు తమ ధాన్యాల విక్రయించుకున్నారు. కొత్తగా ఈ వడ్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వారే కనుక కొనుగోలు చేస్తే మహిళా పేరును ఎలా దాంట్లో రాస్తారు. రైస్ మిల్ పేరు రాయాలి కానీ రైతు పేరు ఎలా రాస్తారు.? అనే దానిపై సమాధానం చెప్పవలసిన జిల్లా అధికారి రిటర్న్ గా రాసివ్వండి తనిఖీ చేస్తానడం, పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా అధికారులు తమ విదులను సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలు జరిగాయాని జిల్లా వ్యాప్తంగా పలువురు పేర్కొంటున్నారు.