గ్రామపంచాయతీ కు ప్రభుత్వ నిధులు లేవు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు విధి నిర్వహణ లేదు

*గ్రామపంచాయతీ కు ప్రభుత్వ నిధులు లేవు, గ్రామపంచాయతీ కార్యదర్శులకు విధి నిర్వహణ లేదు*

*ఊరు ఒక చోట ఉద్యోగం మరొక చోట అన్నట్లుఈ కార్యదర్శుల తీరు..!*

*వారు ఎప్పుడు విధులకు వస్తారో ..ఎప్పుడు పోతారో గ్రామస్తులకే తెలియదు.. గ్రామ పరిపాలనంత కార్యదర్శులకు చేతుల్లోనే..*

*అద్వానంగా కొన్ని గ్రామాలు, మంచినీటి సమస్య పారిశుధ్య సమస్యతో బాధపడుతున్న గ్రామస్తులు*

*ఎర్రు పాలెం మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ శూన్యం… ఆఫీసులకే పరిమితమైన మీటింగ్లు.. ఫీల్డ్ లోకి వెళ్ళని మండల స్థాయి అధికారులు..*

👉మధిర నియోజకవర్గం లోని ఎర్రుపాలెం మండలంలో కొన్ని గ్రామాలను పరిస్థితి అధ్వానంగా తయారైందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో స్థానిక కార్యదర్శులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామ ప్రజల ఆరోపిస్తున్నారు. కార్యదర్శులు స్థానికంగా లేకపోవడంతో వారు విధులకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా తెలియదని ,ఏదైనా అవసరమై ఫోన్ చేసినా కూడా కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదని, ఎప్పుడు కూడా మండల ఆఫీసులో సమావేశంలో ఉన్నట్లు, ఫీల్డ్ లో ఉన్నట్లు తెలుపుతున్నట్లుగా పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రామపంచాయతీ నిధులు రాకపోవడంతో ఇప్పటికే ఎంతో కొంత డబ్బులను మేము పెట్టి ఉన్నాం. ఇంకేం చేయలేం అని కొన్ని గ్రామాల గ్రామ పంచాయితీ కార్యదర్శి చేతులెత్తేశారు. ఎర్రుపాలెం మండలం తెలంగాణ చివరి ప్రాంతం అవడంతో మండల స్థాయి అధికారులు కూడా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తరో అని ప్రజలు ఎదురుచూడాల్సి వస్తుంది. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండలంలోని కొన్ని గ్రామాల పరిస్థితి అద్వానంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేసవి కాలం దృశ్య మండలంలోని పలు గ్రామాలలో త్రాగునీటి సమస్య ఉండడంతో ఈ సమస్యను ఉన్నతాధికారులు గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని, గ్రామ పరిపాలన కార్యదర్శిల చేతిలో ఉండడంతో వారు సజావుగా తమ నిధులను నిర్వహించి ప్రజలకు సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now