*గ్రామపంచాయతీ కార్యదర్శులకు తప్పని ఇబ్బందులు*
*నిధులు లేక సొంత డబ్బులతో గ్రామపంచాయతీ పనులు*
*సిపిఎం మండల కార్యదర్శి చెల్పూరి రాము*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 23 ప్రశ్న ఆయుధం*
ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదని స్వంతంగా ఖర్చు పెట్టుకుని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించాల్సి వస్తుందని ఇల్లందకుంట మండల సిపిఎం కార్యదర్శి చెల్పూరి రాము అన్నారు బుధవారం విలేకరులతో రాములు మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో పరిశుద్ధ పనులకు బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్ డీజిల్, వీధిలైట్లు వెలగకపోయినా కొత్త లైట్లు వేయించడం విద్యుత్ మోటార్లు కాలిపోతే మరమ్మతులు జరిపించాలంటే అందుకు అయ్యే ఖర్చు కార్యదర్శులే భరించాల్సి వస్తుందన్నారు. గ్రామాలలో ఏ సమస్య వచ్చిన పరిష్కారం బాధ్యత కార్యదర్శులకు అప్పగించడంతో నిధులు లేక సొంత డబ్బులతో పనులు చేస్తూ అప్పుల పాలవుతున్నారన్నారు గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని కుక్కల బెడద తీవ్రంగా ఉందని వివిధ గ్రామాలలో మనుషులపై కోతులు, కుక్కలు, దాడి చేయడంతో పాటు గొర్రెలు మేకలను చంపుతున్నాయని కుక్కల బెడద కోతుల బెడదను నివారించాలన్నారు. గ్రామ కార్యదర్శులకు రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్ లు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారని వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు