ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 20, (పశ్న ఆయుధం):
భిక్కనూరు గ్రామంలోని గ్రామపంచాయతీ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల పింఛన్ల కోసం ముట్టడి కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పింఛన్ రూ. 4,000, వికలాంగుల పింఛన్ రూ. 6,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కత్తి పద్మారావు మాదిగ, శివనంద్, సౌందర్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల హక్కులు అమలు కాకపోతే గ్రామ పంచాయతీలు, రహదారులు అడ్డుపడటం, ధర్నాలు వంటి బలోపేత చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.