గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి .

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి .

 

– టి యు సి ఐ రాష్ట్ర నాయకులు రమేష్,

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

 

గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం టి యు సి ఐ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టి యు సి ఐ రాష్ట్ర నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్ల జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు పెంచి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల జీతాలు ఇవ్వాలని జీవో నెంబర్ 51 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్నరు. ప్రభుత్వం దగ్గర నమోదైనది 5400 మంది నమోదు కాని సుమారు 13 వేల మంది ఉన్నారన్నారు. వారి సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు ఆందోళనలకు దారి తీయకుండా ఉండాలి అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600, 19,500, 2,250 చొప్పున మూడు కేటగిరీలుగా జీతాలు పెంచాలని 51వ జీవోలు రద్దు చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల అకౌంట్లో జీతాలు వేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ గ్రాటివిటీ, డ్యూటీ చట్టాలు అమలు చేయాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, మురికి పనులు చేస్తున్న వర్కర్లకు ప్రతినెల శానిటేషన్ వస్తువులు ఇవ్వాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, జిల్లా పంచాయతీరాజ్ శాఖ ను డిమాండ్ చేస్తున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయ ప్రకాష్ ,

గ్రామపంచాయతీ వర్కర్లు కే రాజు, కే రమేష్, ఆర్ నరసింహులు, సిహెచ్ గంగరాజు ,పి రాజు, శ్యామల ,ఓ రాజు ,లింగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now