దోమకొండ మండలం చింతామణి పల్లి లో గ్రామసభ.
ప్రశ్న ఆయుధం జనవరి 9 కామాడ్డి
దోమకొండ మండలంలో ని చింతామణి పల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది, ఇందులో భాగంగా, జనవరి 6 తారీకు నుండి, , గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు,అనగా ఉపాధి హామీ కూలీలు, మొక్కలు నాటిన, వాటికి బిల్స్ వచ్చినయా లేదా, మరియు గ్రామ సంఘం నుండి, డ్వాక్రా మహిళలకు రుణాలు వచ్చినయా లేదా, ఊర్లో ఇంకా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, పూర్తయినయా లేదా అనే అంశం మీద,గ్రామంలోని, డ్వాక్రా మహిళా సంఘాల మరియు గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామపంచాయతీ సిబ్బంది తో,గ్రామసభ నిర్వహించడం జరిగింది.దీనికి అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ రేఖ,పంచాయతీ కార్యదర్శిరమేష్ , డి ఆర్ పి రాజమణి ,టెక్నికల్ అసిస్టెంట్ రాజేశ్వర్ ,అధ్యక్షులు లక్ష్మీ మరియు అంగన్వాడీ టీచర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.