టి ఎన్ జి ఓస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుక…

టి ఎన్ జి ఓస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుక…

టి ఎన్ జి ఓస్ భవన్ లో జాతరను తలపించిన ఐదోరోజు బతుకమ్మ…

టి ఎన్ జి ఓస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ వేడుక అత్యంత ఘనంగా, వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ మిజమ్ముల్ ఖాన్ ఆదేశాల మేరకు టి ఎన్ జి ఓస్ భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా కమిటీ అత్యంత వైభవంగా నిర్వహించింది . ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళలు పెద్దఎత్తున ఉత్సాహంగా,, భక్తిశ్రద్దలతో పాల్గొని గీతాలు ఆలపిస్తూ బతుకమ్మ ఆడారు.తోలుత ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభసుచకంగా గౌరమ్మకు కుంకుమ, పసుపు సమర్పించి బతుకమ్మ వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న మహిళలతో కలిసి భక్తితో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిధి టి జి ఈ జె ఏ సి సెక్రటేరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, 54వ వార్డు కార్పొరేటర్ మిక్కిలినేని మంజులనరేందర్, పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకను నూతన ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మను ఘనంగా జరుపుకునే అవకాశం కలిపించినందుకు ఏలూరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు. జిల్లా అధికారుల సహకారంతో తెలంగాణా లో అత్యంత ప్రతిష్టత్మాకమైన బతుకమ్మ పండుగను జరిపేందుకు జిల్లా కలెక్టర్ టి ఎన్ జి ఓస్ యూనియన్ కు అవకాశం కలిపించడం పట్ల తామంతా యావత్ ఉద్యోగులంతా హర్షంవ్యక్తంచేస్తున్నారన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి బతుకమ్మ వేడుకకు హాజరైన ప్రతీ ఉద్యోగికీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొణిదెన శ్రీనివాస్, జడ్ జయపాల్ విజయకుమార్, ఎస్ లలితకుమారి, కొమరగిరి దుర్గాప్రసాద్, పొట్టపెంజర రామయ్య, గుంటుపల్లి శ్రీనివాస్, తాల్లూరి శ్రీకాంత్, సగ్గుర్తి ప్రకాష్, బుసా చంద్రశేఖర్, పెద్దినేని రాధాకృష్ణ , రవిచంద్ర, కొప్పుల దిలీప్, సెర్ఫ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు జంగం లక్ష్మన్ రావు, కందుల విజయ్, భవాని, వీణా, రవి, మన్మధరావు, ప్రవీణ్,శ్రావణి, తదితరులు పాల్గొన్నారు…

బతుకమ్మ వేడుక ప్రతీ ఇంటి పండుగ…ఏలూరి…

బతుకమ్మ పండుగ ప్రతీ ఇంటి పండుగ అని ఏలూరి పేర్కొన్నారు. టి ఎన్ జి ఓస్ ఆధ్వర్యంలో భవన్ లో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాయలాడుతూ బతుకమ్మ విసిష్టతను వివరించారు. ప్రతీ ఉద్యోగి భక్తితో, ఆనందంతో పాల్గొనే పండుగ బతుకమ్మ అని పెర్కొన్నారు…

Join WhatsApp

Join Now