ఘనంగా సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు.

*ఘనంగా సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు.*

*-జన్మదిన వేడుకలకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు.*

జహీరాబాద్ ప్రతినిధి(నవంబర్ 11)

జనహృదయనేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని లైఫ్ స్టైల్ కాంప్లెక్స్ ముందు నాయకుల, కార్యకర్తల అభిమానుల మధ్య రాష్ట్ర యన్‌ గిరిధర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్‌‌ను కట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి మండల పరిషత్ కార్యాలయం వద్ద గల ( సెట్విన్ భవనం)కు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ ర్యాలీగా వెళ్లి సెట్విన్ కార్యాలయం వద్ద

జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన జన్మదిన సందర్భంగా ఆదరాభిమానాలతో తన పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలకు అభిమానులకు సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా సెట్విన్ చైర్మన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్,నియోజకవర్గ ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ జెడ్పీటీసీలు మాజీ యం.పి.పిలు మాజీ సర్పంచ్ లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment