పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం
సూర్యాపేట జనవరి 27
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా పోరాటంలో ఎన్నో విజయాలు సొంతము చేసుకున్న మందకృష్ణ మాదిగను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 76వ గణతంత్ర దినోత్సవం రోజున పద్మశ్రీ అవార్డు ప్రకటించిన ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మండల అధ్యక్షులు మేరేగా మట్టపల్లి మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు గోపి మాదిగ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూమందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇవ్వటం హర్షించదగ్గ విషయమని, ఒక్క మాదిగ జాతికే కాకుండాదేశ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు పోరాడిన యోధుడు మంద కృష్ణ అన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంజేఎఫ్ సంయుక్త కార్యదర్శికొమ్ము మహేష్ మాదిగ, నియోజకవర్గ ఎం జె ఎఫ్ అధ్యక్షులు బయ్యారపు రవీందర్ మాదిగ, కళాకారుల మండల నందిగామ గోపి మాదిగ,మండల అధికార ప్రతినిధివిజయ్ మాదిగ,మండల సహాయకార్యదర్శి విజయ్ కుమార్,మండల నాయకుడు తెల్ల విజయ్ మాదిగ,రెడపంగు రాము కస్తాల రవీందర్ శశి,యాకూబ్,లక్కీ,వంశీ, గోపి మోజెస్ తిమోతి నవీన్ మనోజ్ తదితరులు యువకులు పాల్గొన్నారు.