ఘనంగా స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు..
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 31:
స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ కూడలిలో గల ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం ఇందిరా గాంధీ పేద ప్రజలకు గరీబీ హటావో అనే నినాదంతోని ఇల్లు లేని వారికి ఇండ్లు నిర్మించడం వ్యవసాయ భూములు ఇవ్వడం బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా ప్రజలకు ఎన్నో గొప్ప సేవలు అందించిన మహా నాయకురాలు ఆమె ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు అధ్యక్షుడు గుడుగుల శీను అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ కారంగుల అశోక్ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్ ఇషాక్ షేరు కన్నయ్య అంజద్ జిల్లా ఉపాధ్యక్షుడు పంపర్ లక్ష్మణ్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్ యాదవ్ ఉన్న రాజేశ్వర్ దోమకొండ శీను లకపోతేని గంగాధర్ సాధిక్ సిద్ధిక్ రఫీ ఎల్లంపేట స్వామి హనుమండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.