పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా దసరా వేడుకలు

 

*కరీంనగర్.* 

 

*పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఘనంగా దసరా వేడుకలు*

 

 *ఆయుధ మరియు వాహన పూజల్లో పాల్గొన్న కరీంనగర్ పోలీస్ కమీషనర్ – అభిషేక్ మొహంతి ఐ.పి.ఎస్.* 

 

 కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు దసరా పండగ సందర్బంగా నిర్వహించిన ఆయుధ మరియు వాహన పూజా కార్యక్రమాల్లో పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపిఎస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ కమీషనరేట్ ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. కమీషనరేట్ ప్రజలంతా, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకాంక్షించారు. 

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ( శాంతి భద్రతలు ) లక్ష్మినారాయణ, ఏసీపీలు విజయ్ కుమార్ (సీసీఆర్బి), మాధవి రిజర్వు ఇన్స్పెక్టర్లు లు రజినీకాంత్ , కుమారస్వామి , జానీమియా , శ్రీధర్ రెడ్డి , సిఐలు సృజన్ రెడ్డిలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now