ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలు..

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలు

– జిల్లా గ్రంథాలయంలో నిర్వహణ

సిద్దిపేట జిల్లా/టౌన్/ప్రశ్నయుధం వార్త/సెప్టెంబర్ 27 ప్రతినిధి ఇన్యాలపు హరికృష్ణ..

IMG 20240927 WA01191

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా గ్రంథాలయ పాలకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. మహాత్మగాంధీ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని ముందుకు నడిచిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగిందన్నారు. 1969 లో తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశ తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మంత్రి పదవిని వదులు కోవడమే కాకుండా తన ఆస్తులను తెలంగాణ ఉద్యమానికి రాసిచ్చిన గొప్ప వ్యక్తి బాపూజీ అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ సిబ్బంది హరి, సాయి, పాఠకులు గణేశ్, తిరుపతి, బాబు, తదితరులు పాల్గొన్నారు…..

Join WhatsApp

Join Now