నారాయణ స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

నారాయణ స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19ప్రశ్న ఆయుధం

ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం నారాయణ స్కూల్‌లో శుక్రవారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆటపాటల్లో మమేకం

మనవళ్ళు, మనుమరాళ్లతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్న తాతయ్యలు, నానమ్మలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నారులతో కలిసి ఆడుతూ పాడిన వృద్ధులు క్షణాలను స్మరణీయంగా మార్చుకున్నారు.

పెద్దలకు గౌరవం – పాఠశాలకు కీర్తి

పెద్దలను గౌరవిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చింది. హాజరైన పెద్దలు పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యులు, సిబ్బంది హాజరు

ఈ వేడుకలో ఏజీఎం హేమంబర్, ఆర్‌ఐ రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ జి.వి.ఎల్. శారద, సమన్వయకర్త గాయత్రీ, వైస్ ప్రిన్సిపల్స్ శిల్ప, విజయలక్ష్మి, ఏవోలు రాజేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు

తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు విస్తృతంగా హాజరై గ్రాండ్ పేరెంట్స్ డేను విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now