ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

IMG 20240820 WA1970

IMG 20240820 WA1972

రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్బంగా ఎన్.ఎస్.యు.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 

కొత్తగూడెం ( ) భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం ఉర్దూఘర్ లో ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిధులుగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు జెబి శౌరి, రాష్ట్ర మైనారిటీ నాయకులు ఉర్దూఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నర్సింహారావు, కొత్తగూడెం నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు ఎండి గౌస్ మొయినుద్దీన్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టెలికాం, ఐటీ రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేత, దేశం కోసం ప్రాణన్ని త్యాగం చేసిన నాయకుడని తెలిపారు. ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని నిర్వాహకులు ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్ ను ప్రత్యేకంగా అభినందించారు..

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, గారిపేట ఎంపీటీసీ భద్రం, భిక్షపతి, దావూద్, ఏలూరి రాందాస్, కొమరయ్య, వినయ్, షబానా, జయప్రకాష్, యువజన కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభ్యర్థి గడ్డం రాజశేఖర్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు అబ్దుల్ హమీద్, షేక్ అజారుద్దీన్, దివాకర్,గౌతమ్, కాటి సందీప్, మహేష్, షాను, మోహిన్, సద్దాం, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now