మస్కట్లో బల్ల ఆంజనేయులు (అనిల్) ఇంట్లో ఘనంగా రాఖీ వేడుకలు

మస్కట్లో బల్ల అంజనేయులు ఇంట్లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు..

మస్కట్లో బల్ల ఆంజనేయులు (అనిల్)  నివాసంలో సోమవారం  రాఖీ పండుగాను ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెలు అన్న తమ్ములకు రాఖీలు కట్టుకొని మిఠాయిలను తినిపించారు. అనంతరం అన్న తమ్ముడికి అక్క చెల్లెలు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంజనేయులు (అనిల్) మాట్లాడుతూ  రాష్ట్ర ఆడపడుచులకు, అన్నదమ్ములకు, మిత్రులందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పండుగ అనేది సోదరీ సోదరుల ప్రేమకు ప్రతీక అని, ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ పండుగ. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారని. చిన్నా పెద్దా, పేద ధనిక తేడాలు లేకుండా. అందరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుందని, సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని రాఖీ ద్వారా తెలియజేస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తన సతీమణి సుజాత. తమ్ముడు శ్రీనివాస్.సాద్వి. కూతుళ్లు అల్లుళ్లు చెల్లెలు పాల్గొనడం జరిగింది..

.

Join WhatsApp

Join Now