వైభవంగా నల్లపోచమ్మ బోనాల పండగ

*వైభవంగా నల్లపోచమ్మ బోనాల పండగ*

*బోనమెత్తిన పోచారం శ్రీనివాస్ రెడ్డి,కాసుల బాలరాజ్*

IMG 20250323 WA0008

ఆయుధం న్యూస్ బాన్సువాడ మార్చ్-23

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 12 వ వార్డులో శ్రీ నల్ల పోచమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు.

ఇ బోనాల పండగలో నాయకులు ఇద్దరు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని,ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్నరు.

ఈ బోనాల పండుగలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now