ఘనంగా మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి
తాత ఆశయాలను కొనసాగిస్తా
బాలికల ప్రభుత్వ పాఠశాలకు వాటర్ పూరిఫయిర్ అందజేత
నిరుపేద కుటుంబానికి చెందిన పేద విద్యార్థినిని ఎంబిబిఎస్ చదివిస్తున్న ప్రణవ్
హుజురాబాద్ నియోజకవర్గ నుండి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..
హుజురాబాద్ నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
జమ్మికుంట హుజురాబాద్ ప్రశ్న ఆయుధం జులై 24
రాజకీయ దురంధరుడు స్నేహశీలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ తో పాటు హుజురాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రణవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారు లేనివారని అడిగిన వారికి లేదనకుండా సహాయం చేయడమే కాకుండా పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని ఆనాటి ప్రధానమంత్రి పి.వీ.నరసింహరావుకి చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేశారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు వర్ధంతి రోజున ప్రభుత్వ బాలిక పాఠశాలకు ఉచితంగా వాటర్ ప్యూరిఫైర్ అందించారు.తన స్వగ్రామమైన సింగపూర్ కు చెందిన నిరుపేద అమ్మాయి వేల్పుకొండ సంజీవని గత సంవత్సరం ఎంబిబిఎస్ లో మంచి ఉత్తీర్ణత సాధించగా సిద్ధిపేట గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చిందని తాత పేరు మీద విద్యకు అవసరం అయ్యే ఆన్ని ఖర్చులను ప్రణవ్ భరిస్తున్నారని వర్ధంతి రోజున ప్రభుత్వ దవాఖానలోనీ రోగులకు పండ్లు పంపిణీ చేశారు
విద్య,వైద్యం,పేదలకు సేవ చేయడంలో మరింత ముందు ఉంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వోడితల రాజేశ్వర రావు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.