Site icon PRASHNA AYUDHAM

చెరువుల అభివృద్ధి కొరకు  నిధులు మంజూరు

IMG 20250521 WA2335

చెరువుల అభివృద్ధి కొరకు

నిధులు మంజూరు

ప్రశ్న ఆయుధం మే 21: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాధికారులతో మరియు వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి అధికారులతో నల్లచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని చెరువు అభివృద్ధి కొరకు ఇప్పటికే నిధులు మంజూరైన కారణంగా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని.. అలాగే వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా పైప్లైన్ నిర్మాణం & (రిటర్నింగ్ వాల్స్) చేపట్టి దిగువకు నీరు వెళ్లే విధముగా చూడాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచన చేశారు. జిహెచ్ఎంసి & వాటర్ వర్క్స్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని యం ఎల్ ఎ అధికారులకు తెలిపారు.

హైడ్రా అధికారులు డి.ఈ నాగరాజు, జి.హెచ్.యం & వాటర్ వర్క్స్ అధికారులు సి.సి చిన్న రెడ్డి నిఖిల్ రెడ్డి , నాగ ప్రియా, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు

Exit mobile version