Site icon PRASHNA AYUDHAM

గడ్డి మందు తాగిన రైతు..!!

IMG 20250806 WA0058

గడ్డి మందు తాగిన రైతు..!!

 

అడవిబానిస పాలసీపై రైతుల ఆగ్రహం..!!

ప్రశ్న ఆయుధం, ఆగస్టు 06, కామారెడ్డి జిల్లా గాంధారి

సీతాయిపల్లి శివారులోని గండి మైసమ్మ కుంట భూమిపై ఫారెస్ట్ అధికారుల యాక్షన్

వరి నాటుకు అడ్డుపడిన ఫారెస్ట్ సిబ్బంది, గడ్డి మందు పిచికారిరైతు కోర్రె మల్లయ్య తమ్ముడు గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స

కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు

పోలీసుల అప్రమత్తతతో ఆసుపత్రికి తరలింపు

గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామ శివారులో గల గండి మైసమ్మ కుంట పరిసర భూమిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ భూమి అటవీ శాఖకి చెందినదని పేర్కొంటూ ఫారెస్ట్ అధికారులు వరి నాటుకు అడ్డుపడ్డారు. అయినా సైతం గ్రామానికి చెందిన కోర్రె మల్లయ్య నాలుగు ఎకరాల్లో వరి నాటును కొనసాగించడంతో అధికారుల ప్రతిస్పందన తీవ్రంగా మారింది.

ఈ క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది ఆ భూమిలో గడ్డి మందు పిచికారీ చేయగా, మల్లయ్య సహా ఇతర రైతులు దానికి నిరసన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు విధుల్లో ఆటంకం కలిగించారంటూ మల్లయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మల్లయ్య తమ్ముడు కోర్రె చిన్న మల్లయ్య గడ్డి మందు తాగి పోలీస్ స్టేషన్‌కి రావడంతో అధికారులు అప్రమత్తమై అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భూములపై స్పష్టత లేని అధికారుల తీరును తప్పుబడుతున్నారు.

Exit mobile version